PM Modi: ప్రభుత్వాల కూల్చివేతపై కాంగ్రెస్‌కు మోడీ కౌంటర్.. ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్తే..

Narendra Modi: ప్రభుత్వాల కూల్చివేతపై రాజ్యసభలో దుమారం చెలరేగింది.

Arun Chilukuri
Published on: 9 Feb 2023 4:29 PM IST
PM Modi Targetted the Congress in Rajya Sabha
X

PM Modi: ప్రభుత్వాల కూల్చివేతపై కాంగ్రెస్‌కు మోడీ కౌంటర్.. ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్తే..

Narendra Modi: ప్రభుత్వాల కూల్చివేతపై రాజ్యసభలో దుమారం చెలరేగింది. కూల్చివేతల సర్కార్ మీదంటే మీదంటూ కాంగ్రెస్, బీజేపీ ఒకరిపై మరొకరు తిట్లపురాణం అందుకున్నారు. అయితే అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోడీ శివాలెత్తారు. ఆరు దశాబ్ధాలకుపైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ సర్కార్ తీరు చూస్తే బాధ, కోపం వస్తుందన్నారు.

దేశ ప్రగతిని కాంగ్రెస్ నాశనం చేసిందన్న మోడీ...దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టిన ఘనచరిత్ర ఆపార్టీకి ఉందన్నారు. తమిళనాడులో ఎంజీఆర్ వంటి దగ్గజ ప్రభుత్వాలను కూడా కాంగ్రెస్ కూకటివేళ్లతో పెకిలించి వేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు..ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్తే..ఆ వెంటనే ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. అలాంటి ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ..బీజేపీని అనడం ఎంతవరకు సమంజసం అని మోడీ ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story