PM Modi: కరోనా కట్టడి చర్యలపై ప్రధాని మోడీ సమీక్ష

PM Modi: కరోనాపై అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ వర్చువల్ భేటీ * ఈ నెల 16న ఏపీ సీఎం జగన్‌తో చర్చించనున్న ప్రధాని

Sandeep Eggoju
Updated on: 13 July 2021 5:55 PM IST
PM Modi Review on Corona Conditions in India
X

కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ సమీక్ష (ఫైల్ ఇమేజ్)

PM Modi: కోవిడ్ కట్టడి చర్యలకు సంబంధించి రాష్ట్రల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ సమీక్ష నిర్వహించిన ప్రధాని ఈనెల 16న ఏపీ సీఎం జగన్‌తో సమీక్షించనున్నారు. ఈ వర్చువల్‌ భేటీలో ఏపీలోని కోవిడ్ పరిస్థితులను ప్రధాని మోడీకి సీఎం జగన్ వివరించనున్నారు. మరోవైపు అదేరోజు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులతో మోడీ సమీక్ష నిర్వహించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత కరోనా పరిస్థితులు కట్టడి చర్యలపై ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకొని పలు కీలక సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story