PM Modi leaves from Delhi for Ayodhya: అయోధ్యకు బయలుదేరిన ప్రధాని మోడీ
PM Modi leaves from Delhi for Ayodhya: అయోధ్యలో రామాలయానికి భూమి పూజ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక జెట్ విమానంలో లక్నోకు బయలుదేరారు. 11.30గంటలకు ప్రధాని అయోధ్య చేరుకుంటారు. మొదట హనుమాన్‌గఢీ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం 12 గంటలకు అయోధ్య రామమందిరం వద్దకు చేరుకుని 12.45గంటల వరకు రామమందిరం భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. 2:15 గంటలకు ప్రధాని తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రామమందిరం భూమిపూజ సందర్భంగా అయోధ్యలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీజీ బలగాలు ఇప్పటికే అయోధ్యను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
Next Story




