LK Advani Statement on Ram Madir: తన కల సాకారమైందన్న అద్వానీ.. రామమందిర నిర్మాణంపై ప్రకటన

LK Advani Statement on Ram Madir: తన కల సాకారమైందన్న అద్వానీ.. రామమందిర నిర్మాణంపై ప్రకటన
x
LK Advani (File Photo)
Highlights

LK Advani Statement on Ram Madir: కరోనా తరువాత దేశ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ రామ మందిరం నిర్మాణంపైనే.

LK Advani Statement on Ram Madir: కరోనా తరువాత దేశ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ రామ మందిరం నిర్మాణంపైనే. నెల రోజుల నుంచి ఈ కార్యక్రమానికి ఎవర్ని పిలుస్తారు...ఎంతమందిని ఆహ్వానిస్తారు, శంఖుస్థాపన ఏ విధంగా చేస్తారు అనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే అసలు రామ మందిరం నిర్మాణానికి పోరాటం చేసిన వారిలో అద్వానీ ఒకరు. తొలుత ఆయన్ను పిలుస్తారా? లేదా? అనే సందిద్గత నుంచి వీడియో ద్వారా పాల్గొనేందుకు అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఆయన మీడియాతో మాట్లాడారు. రామ మందిర నిర్మాణం తన కల అని, అది సాకారం అవుతున్నందుకు గర్వంగా ఉందన్నారు.

మరికొన్ని గంటల్లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం భూమి పూజ కార్యక్రమం జరగబోతోంది. ఈ మహత్తర కార్యానికి అయోధ్య నగరం ముస్తాబైంది. విద్యుత్ కాంతులతో నగర మంతా శోభాయమానంగా కన్పిస్తోంది. నగరం ఏటువైపు చూసినా కాషాయ జెండాలు, రాముడి చిత్ర పటాలే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖులంతా అయోధ్య నగరానికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహత్తర కార్యానికి భూమిపూజ జరగనుంది. అయితే ఈ క్రమంలో రామ మందిర నిర్మాణానికి పోరాడిన వ్యక్తుల్లో ఒకరైన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ స్పందించారు. రామ మందిర భూమి పూజ విషయంతో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లకు తన కల సాకారమైందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయడం చారిత్రాత్మకమన్నారు.

ఇది తనతో పాటు.. భారతీయులందరికీ ఓ ఉద్వేగపూరిత క్షణమన్నారు. రామజన్మభూమిలో మందిర నిర్మాణం బీజేపీ కల అని.. రథయాత్ర ద్వారా ఉద్యమంలో పాల్గొని.. నా ధర్మాన్ని, కర్తవ్యాన్నినిర్వహించానన్నారు. సుప్రీం తీర్పుకు లోబడి సామరస్య వాతావరణంలో.. మందిర నిర్మాణం జరగడం ఎంతో శుభపరిణామంటూ వ్యాఖ్యానించారు. మందిర నిర్మాణంతో.. రామ రాజ్యం వైపు అడుగులు పడుతున్నాయని.. సుపరిపాలన, సమ న్యాయం, సిరి సంపదలకు రామ రాజ్యం ఓ ఉదాహరణ అన్నారు. కాగా, రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీతో పాటు మరికొందరు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories