PM Modi: దక్షిణాఫ్రికా బయలుదేరిన ప్రధాని.. బ్రిక్స్ భేటీలో పాల్గొననున్న మోడీ

PM Modi: జిన్‌పింగ్‌తో మోడీ భేటీపై స్పష్టత ఇవ్వని విదేశాంగ శాఖ

Shekhar G
Published on: 22 Aug 2023 10:49 AM IST
PM Modi Leaves For BRICS Summit In Johannesburg
X

PM Modi: దక్షిణాఫ్రికా బయలుదేరిన ప్రధాని.. బ్రిక్స్ భేటీలో పాల్గొననున్న మోడీ

PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. దక్షిణాఫ్రికా, గ్రీస్‌లో ఆయన పర్యటించనున్నారు. దక్షిణాఫ్రికాలో మూడ్రోజులపాటు పర్యటించనున్న మోడీ.. ఇవాళ బ్రిక్స్‌ లీడర్స్‌ రిట్రీట్‌లో పాల్గొంటారు. రేపు జోహన్నెస్‌బర్గ్‌లో 15వ బ్రిక్స్‌ సదస్సుకు మోడీ హాజరుకానున్నారు. ఇప్పటికే జోహన్నెస్‌బర్గ్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చేరుకున్నారు. అయితే.. జిన్‌పింగ్‌తో మోడీ భేటీపై విదేశాంగ శాఖ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. ఈ నెల 25న గ్రీస్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story