PM Modi: కాంగ్రెస్, డీఎంకే పాలనలో కుంభకోణాలే కనిపిస్తాయి

PM Modi: మా పాలనలో అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తుంది

Jyothi
Published on: 15 March 2024 1:50 PM IST
PM Modi Comments on Congress, DMK
X

PM Modi: కాంగ్రెస్, డీఎంకే పాలనలో కుంభకోణాలే కనిపిస్తాయి

PM Modi: టార్గెట్ 400తో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్న బీజేపీ సౌత్ ఇండియాపై నజర్ పెంచింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రధాని మోడీ తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించారు. అక్కడి బహిరంగ సభలో అధికార పార్టీ డీఎంకే, ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్, డీఎంకే అవినీతి చరిత్ర కలిగిన పార్టీలని విమర్శిస్తూ.. ఎప్పటికీ ఈ రెండు పార్టీలు తమిళనాడు అభివృద్ధి కోసం పనిచేయలేవన్నారు. NDA పాలనలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు కనిపిస్తే... UPA పాలనలో కుంభకోణాలే కనిపిస్తాయని ఎద్దేవా చేశారు ప్రధాని మోడీ. దోచుకోవడమే కాంగ్రెస్, డీఎంకే పని అంటూ ఆరోపణలు చేశారు.

Jyothi

Jyothi

Next Story