ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ

* ఉ.11.30 గంటలకు వర్చువల్‌ విధానంలో సమావేశం * బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ ఎజెండా వివరించనున్న కేంద్రం

Sandeep Eggoju
Updated on: 30 Jan 2021 11:56 AM IST
PM Modi to Hold All-Party Meeting Today
X

 PM Modi (file image)

ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు వర్చువల్‌ విధానంలో జరిగే ఈ భేటీలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ ఎజెండాను వివరించనున్నారు. అఖిలపక్షాలతో భేటీ అనంతరం ఎన్‌డీయే భాగస్వామ్య పక్షాలతో సమావేశం కానున్నారు ప్రధాని మోడీ.

నిన్న ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగంతో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా సమావేశాల ప్రారంభానికి ముందే అఖిలపక్ష భేటీ జరుగుతుంది. కానీ.. ఈ సారి అలా కాకుండా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన అనంతరం ఆల్‌పార్టీ మీటింగ్ జరుగుతోంది. మరోవైపు ఈ భేటీలో ప్రతిపక్షాలు ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనపై చర్చకు డిమాండ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story