Delhi: పదేళ్ల బాలికను పనిలో పెట్టుకొని హింసించిందని.. మహిళా పైలట్‌ను ఆమె భర్తను చితకబాదిన స్థానికులు..
Delhi: 10 ఏళ్ల బాలికను ఇంట్లో పనికి పెట్టుకుని చిత్రహింసలకు గురిచేశారని దాడికి పాల్పడ్డారు
Delhi: పదేళ్ల బాలికను పనిలో పెట్టుకొని హింసించిందని.. మహిళా పైలట్‌ను ఆమె భర్తను చితకబాదిన స్థానికులు..
Delhi: ఢిల్లీలోని ద్వారకలో ఓ మహిళా పైలట్‌ను చితకబాదారు స్థానికులు. 10 ఏళ్ల బాలికను ఇంట్లో పనికి పెట్టుకుని చిత్రహింసలకు గురిచేశారని దాడికి పాల్పడ్డారు. ద్వారకలో నివసిస్తున్న ఓ మహిళా పైలట్, ఆమె భర్త..రెండు నెలల క్రితం ఓ చిన్నారిని పనిలో పెట్టుకున్నారు. అమానవీయంగా ప్రవర్తించి ఆ బాలికకు నరకం చూపారు. అయితే ఇవాళ ఉదయం ఆ చిన్నారిని చూసేందుకు తన బంధువు వచ్చాడు. చిన్నారి శరీరంపై గాయాలు గుర్తించాడు. పైలట్, ఆమె భర్త.. చిన్నారిని హింసిస్తున్నట్లు తెలుసుకున్న బాలిక బంధువు పోలీసులకు సమాచారమిచ్చాడు. అయితే, పోలీసులు వచ్చేలోగా విషయం తెలుసుకున్న స్థానికులు, బాలిక బంధువులు మహిళా పైలట్ ఇంటి ముందుకు వచ్చి గొడవపడ్డారు. వీధిలోకి లాగి వారిపై దాడికి దిగారు. ఆ మహిళా పైలట్‌ను రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి కొట్టారు. అడ్డొచ్చిన పైలట్ భర్తపైనా దాడి చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


