Top
logo

అరుణ్ జైట్లీ అంత్యక్రియలనూ వదలని కేటుగాళ్ళు!

అరుణ్ జైట్లీ అంత్యక్రియలనూ వదలని కేటుగాళ్ళు!
X
Highlights

చోరీ చేయాలనుకునే వారికి చోటుతో పని లేదు. తమ చేతివాటం చూపడానికి అది శ్మశానమైనా ఫర్వాలేదు. అందులోనూ.. వీఐపీలు ఎక్కువగా ఉండే చోటయైతే భారీగా వర్కౌట్ అవుతుంది. అందుకే కాబోలు ఆ చొరగ్రేసరులు ఏకంగా కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అన్యక్రియాల విషాద సమయాన్ని ఎంచుకుని తమ కత్తెర్లకు పని చెప్పారు.

సందట్లో సడేమియా అంటే ఇదే. అందరూ విషాదంలో మునిగిన వేళ తమ దొంగ బుద్ధితో దొరికిన కాడికి నొక్కేశారు. బజారు.. ఇల్లు.. స్మశానం కాదేదీ దొంగతనానికి అనర్హం అని నిరూపించారు ఆ కేటుగాళ్ళు. అక్కడా ఇక్కడా జేబులు కొట్టేస్తే ఏమొస్తుంది? వీఐపీలను టార్గెట్ చేస్తే చింత ఉండదు అనుకున్నట్టున్నారు. ఏకంగా కేంద్రమాజీ మంత్రి అరుణ్ జట్లీ అన్త్యక్రియల్లోనే తమ చేతివాటం చూపెట్టారు.

ఒకరి దగ్గరా ఇద్దరి దగ్గరా కాదు.. ఏకంగా 11 మందికి పైగా వీఐపీల జేబులు కొట్టేశారు. దాదాపు 35 మొబైల్ ఫోన్లు లేపేశారు. సంచలనం సృష్టిస్తున్న ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదివారం అరుణ్ జైట్లీ అంత్యక్రియలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజా ప్రతినిధులు, వీఐపీలు హాజరయ్యారు. ఇదే అదునుగా భావించిన చోరీగాళ్లు విలువైన వస్తువులు కాజేయడం మొదలుపెట్టారు. తమ ఫోన్ ఫోన్లు, విలువైన వస్తువులు పోయాయంటూ వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పతంజలి ప్రతినిధి ఎస్.కే. తజరవాలా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. తనతో పాటు 11 మంది ప్రముఖుల ఫోన్లు దొంగలు ఎత్తుకెళ్లినట్టు పేర్కొన్నారు. అయితే దీనిపై బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియా మరోలా స్పందించారు. దాదాపు 35 మంది ఫోన్లను దొంగలించినట్లు చెప్పారు. ఆ రోజు మొత్తం ఏయే ప్లేస్ లలో ఉందో గూగుల్ మ్యాప్ ట్రాకింగ్ ద్వారా గుర్తించినట్లు వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వేటసాగిస్తున్నారు.
Next Story