Petrol Diesel Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Diesel Price Today: పెట్రోల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 26 పైసలు పెరిగాయి.

Kranthi
Published on: 29 May 2021 9:38 AM IST
Petrol Price Today in Hyderabad Vijayawada Diesel Rate Today in Delhi 29 05 2021
X

Petrol Diesel Price Today:(File Image) 

Petrol Diesel Price Today: నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 26 పైసలను చమురు కంపెనీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈ నెలలో చమురు ధరలు దాదాపు 15సార్లు పెరిగాయి. ఈ నెలలోనే లీటర్‌ పెట్రోల్‌పై రూ.3.61, డీజిల్‌పై రూ.4.11 పెరగడం గమనార్హం.

దేశంలోని వివిధ నగరాల్లో...

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.93.94 కి చేరగా.. లీటర్ డీజిల్‌ ధర రూ.84.89కి చేరింది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.19, డీజిల్ రూ.92.17కు పెరిగింది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.51 ఉండగా.. డీజిల్‌ రూ.89.65గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.97గా.. డీజిల్‌ ధర రూ.87.74 గా ఉంది. బెంగళూరులో బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.07.. డీజిల్‌ రూ.89.99 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో …

ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.100.11 గా ఉండగా.. రూ. 94.43గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర.97.63, లీటర్‌ డీజిల్‌ రూ.92.54కు పెరిగింది.

Kranthi

Kranthi

Next Story