తలాక్ బిల్లుపై ఆ ఎంపీల వైఖరిపై సర్వత్రా ఆశ్చర్యం

తలాక్ బిల్లుపై ఆ ఎంపీల వైఖరిపై సర్వత్రా ఆశ్చర్యం
x
Highlights

తలాక్ బిల్లు నిన్న రాజ్యసభలో తలాక్ బిల్లు ఆమోదం పొందింది. నిజానికి రాజ్యసభలో అధికార పక్షం బీజేపీకి తగినంత మద్దతు లేదు. కానీ, కొన్ని విపక్షాలు సభ నుంచి...

తలాక్ బిల్లు నిన్న రాజ్యసభలో తలాక్ బిల్లు ఆమోదం పొందింది. నిజానికి రాజ్యసభలో అధికార పక్షం బీజేపీకి తగినంత మద్దతు లేదు. కానీ, కొన్ని విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేయడం ద్వారా పరోక్షంగా బిల్లు గట్టెక్కడానికి సహాయపడ్డాయి. దీంతో ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందీ లేకుండా బిల్లు విషయంలో ఒడ్డున పడినట్టైంది. వాకౌట్ చేసిన పక్షాలు చాలానే ఉన్నప్పటికీ, కాశ్మీర్ కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఎంపీలలో ఇద్దరు వాకౌట్ చేయడం అందరిలోనూ చర్చను రేకెత్తించింది. ఎందుకంటే, తమ సభ్యులు బీజేపీ ప్రతిపాదించిన ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఒతేస్తారంటూ పీడీపీ అధినేత మొహబూబా ముఫ్తీ ప్రకటించారు. కానీ, దానికి భిన్నంగా ఆ పార్టీ ఎంపీలు ఇద్దరు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో పరోక్షంగా బిల్లు ఆమోదం పొందడానికి సహకరించిన పార్టీల్లో పీడీపీ కూడా చేరినట్టు అయింది.

కాగా, తలాక్ బిల్లు ఆమోదం విషయం పై మొహబూబా ముఫ్తీ ట్విట్టర్ లో ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ''ఇన్‌స్టంట్‌ తలాక్‌ చట్టవిరుద్ధం అని సుప్రీంకోర్టు తేల్చిన తర్వాత కూడా దీనిపై చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏముందో అర్థం కాలేదు. ఈ అనవసరపు జోక్యం ముస్లింలను శిక్షించడానికే. ప్రస్తుతం మనమున్న ఆర్థిక పరిస్థితుల్లో దీనికి అంత ప్రాధాన్యం ఇవ్వడం అవసరమా?'' అంటూ ఆమె ప్రశ్నించారు.

అయితే, ఈ విషయంపై పీడీపీ ప్రత్యర్థి పార్టీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. సభలో బీజేపీకి పరోక్ష మద్దతు పలికి.. ఇపుడు తిరిగి అదే అంశంపై ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదంటూ అయన మండిపడ్డారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories