పాకిస్థాన్ తో ముంచుకొస్తున్న ముప్పు.. కాశ్మీర్ లో ఆందోళన!

పాకిస్థాన్ తో ముంచుకొస్తున్న ముప్పు.. కాశ్మీర్ లో ఆందోళన!
x
Representational Image
Highlights

కరోనా మన దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. భారత ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం చాలా కష్టపడుతోంది.

కరోనా మన దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. భారత ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం చాలా కష్టపడుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించారు. ఈరోజు ప్రజలకోసం ప్రత్యెక ఆర్ధిక ప్యాకేజీ కూడా ప్రవేశపెట్టారు. మనవైపు ఇంత జాగ్రత్తలతో ముందుకు వెళుతుంటే మరోవైపు దాయాది దేశం పాకిస్థాన్ మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్ లో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. అయితే, అక్కడి ప్రభుత్వం మాత్రం దాని కట్టడికి ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. అరకోరాగా ఏవో సర్దుబాట్లు చేస్తూ వస్తోంది. ఇప్పుడు కొత్తగా పాకిస్థాన్ చేస్తున్న పని భారత దేశానికి తలనొప్పిగా మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని కోవిడ్ పేషంట్లను పాకిస్థాన్ ఆర్మీ పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్) లోకి తరలిస్తోన్నట్టు తెలుస్తోంది. పీవోకే లోని మిర్పూర్ సహా ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు సమాచారం అందుతోంది. ఆర్మీ కేంద్రాలు, సైనికుల కుటుంబాలకు సమీపంలో ఒక్క కరోనా పేషెంట్ కూడా ఉండవద్దని పాక్ ఆర్మీ చీఫ్ ఆదేశాలు జారీచేయడంతో వారిని దూరంగా తరలించడం కోసం మిర్పూర్ ను ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. లాక్ చేసిన వాహనాల్లో పెద్ద సంఖ్యలో కరోనా పేషెంట్లను మిర్పూర్ సిటీ, పీవోకే లోని ఇతర ప్రాంతాలకు చేరుస్తున్నారు. అయితే, ఇక్కడ సరైన వైద్య సిబ్బంది లేరు. దీంతో పీవోకే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్థానిక కాశ్మీరీ ప్రజలకు పాక్ తీసుకుంటున్న ఏఎ చర్యల వల్ల తీవ్ర ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాక్ ఆర్మీ పంజాబ్ గురించి తప్ప దేని గురించి ఆలోచించడం లేదని పీవోకే ప్రజలు ఆరోపిస్తున్నారు. పంజాబ్‌లో కరోనా లేకుండా చేయడం కోసం కశ్మీర్, గిల్గిట్‌లను చెత్తకుండీలుగా వాడుకుంటున్నారని పీవోకే చెందిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకూ పాకిస్థాన్ లో 1000 కోవిడ్ కేసులు నమోదు కాగా.. ఒక్క సింధు ప్రావిన్స్‌లోనే 400 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. పంజాబ్ ప్రావిన్స్‌లో 300 కరోనా కేసులు నమోదయ్యాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories