ముంబయి ఎయిర్ పోర్టులో కార్గో విమానానికి తప్పిన ముప్పు

ముంబయి ఎయిర్ పోర్టులో కార్గో విమానానికి తప్పిన ముప్పు
x
Highlights

తుఫాను తగ్గినా దాని ప్రభావం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ముంబయికి దూరంగా నిసర్గ తీరం దాటడంతో చాలా వరకు దాని ప్రభావం పట్టణంపై పడలేదు.

తుఫాను తగ్గినా దాని ప్రభావం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ముంబయికి దూరంగా నిసర్గ తీరం దాటడంతో చాలా వరకు దాని ప్రభావం పట్టణంపై పడలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దీనివల్ల విమానాశ్రయంలోని రన్ వే పై నీరు నిలిచిపోవడం వల్ల విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఇబ్బందులు రావడం వల్ల పలు విమానాలను రద్దు చేయడం జరిగింది.

పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెడెక్స్ కార్గో విమానానికి పెను ప్రమాదం తప్పింది. నిసర్గ తుఫాను కారణంగా కురిసిన వర్షంతో ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ ఎయిర్ ‌పోర్టులో రన్‌వే పై వరద నీరు చేరింది. గురువారం బెంగుళురు నుంచి వచ్చిన ఫెడెక్స్‌ కార్గో విమానం రన్‌ వే నుంచి దూరంగా ల్యాండ్‌‌ అయింది. ఈ విమానానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, విమాన కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగలేదని అధికారులు వెల్లడించారు. అయితే, ముంబయి ఎయిర్ పోర్టులో కార్గో విమానానికి తప్పిన ముప్పుముంబై ఎయిర్‌ పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు.

తుపాన్‌ కారణంగా ముంబైకి ఎయిర్‌ పోర్టుకు వచ్చే మొత్తం 19 విమానాల రాక పోకలను నిలిపి వేస్తున్నట్లు అధికారులు పేర్కోన్నారు. నిసర్గ తుపాన్‌ ముందు జాగ్రత్త చర్యగా ఎయిర్‌పోర్టును రాత్రి 7గంటల వరకు మూసివేశారు. తుపాను తీవ్రత నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకునేందుకు నగరంలో 144 సెక్షన్‌ విధించినట్లు గ్రేటర్‌ ముంబై పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories