డేంజరస్‌ యాప్స్‌ గుండెల్లో దడ.. ఎడాపెడా యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తే ఇక అంతే!!

డేంజరస్‌ యాప్స్‌ గుండెల్లో దడ.. ఎడాపెడా యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తే ఇక అంతే!!
x

డేంజరస్‌ యాప్స్‌ గుండెల్లో దడ.. ఎడాపెడా యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తే ఇక అంతే!!

Highlights

*యాప్స్‌ చెడుగుడు ఆడుతున్నాయి *అన్‌ ఇన్స్టాల్‌ చేసుకోకుంటే ఇక అంతే *ఇంటర్నెల్‌ స్టోరేజీని, మన సీక్రెట్‌ను ఓపెన్‌ చేస్తున్నాయి

హలో... జస్ట్‌ ఏ మినట్‌... మీ మొబైల్‌లో ఏ యాప్స్‌ ఉన్నాయో తెలుసా మీకు? మెమరీ కార్డు ఉంది కదా అని ఎడాపెడా యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోకండి. కొంప కొల్లేరు చేయడానికి బతుకు బస్టాండ్‌ చేయడానికి యాప్స్‌ వెయిట్‌ చేస్తున్నాయి. ఫోన్లే కాదు యాప్స్‌ కూడా కొంపలో కుంపట్లు పెట్టేందుకు కుతకుతలాడుతున్నాయి. అలర్ట్‌గా లేకుంటే అడ్రస్‌ గల్లంతు చేస్తామంటున్నాయి. ఇంతకీ ఏంటీ యాప్స్‌ ఎటాక్‌ కథ.?

యాప్స్‌ చెడుగుడు ఆడుతున్నాయి అన్‌ ఇన్స్టాల్‌ చేసుకోకుంటే ఇక అంతే ఇంటర్నెల్‌ స్టోరేజీని, మన సీక్రెట్‌ను ఓపెన్‌ చేస్తున్నాయి. డేంజరస్‌ యాప్స్‌ గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. పేటీఎం పేరిట నకిలీ యాప్‌ అల్లాడించేసింది. నకిలీ పేటీఎం యాప్‌ను క్రియేట్‌ చేసిన కేటుగాళ్లు హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన నకిలీ యాప్‌ల బాగోతాన్ని బట్టబయలు చేసింది. బజారుకీడ్చింది. పాతబస్తీలోని ఓ బట్టల దుకాణానికి వెళ్లిన ముఠా సభ్యులు 28 వేల విలువైన వస్త్రాలు కొని పేటీఎం ద్వారా బిల్లు చెల్లిస్తామంటూ షాప్ యాజమానితో సెల్ నంబర్ తీసుకున్నారు. తీరా ఖాతాలో చూస్తే డబ్బు జమ కాలేదు. రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ యాప్ గుట్టురట్టు చేశారు.

మొన్నటివరకూ చైనా ఫోన్లతో తంటాలు పడ్డ జనం ఇప్పుడు సరికొత్త సమస్యతో సతమతమవుతున్నారు. మనం రెగ్యులర్‌గా వాడే కొన్ని ప్రమాదకరమైన యాప్స్‌ని యాజ్‌ ఎర్లీ యాజ్‌ పాజిబిల్‌ వాటిని అన్ ఇన్స్టాల్ చేసుకుంటే హండ్రెడ్‌ పర్సెంట్‌ బెటర్‌. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ప్రతీ ఒక్కరు జనరల్‌గా గూగుల్‌ ప్లేస్లోర్‌లో అదే పనిగా బ్రౌజ్‌ చేస్తుంటారు. కొత్త యాప్‌ ఏమైనా కనపడగానే స్టోరేజీ ఉంది కదా అని డౌన్‌లోడ్‌ చేసేస్తుంటారు. ఇప్పుడే అదే కొంప ముంచేస్తుంది. అదేపనిగా వాటిని వాడేస్తుంటే మన జీవితాలతో అవి ఆడేసుకుంటున్నాయి. మన ఫోన్లో ఎక్కువ మెమోరి ఉందని ఎడాపెడా యాప్స్ ఇన్‌స్టాల్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి.

సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్ నుంచి అనేక యాండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ సేకరించి వాటి లోతుల్లోకి వెళ్లి చూసింది ఇంటెలిజెన్స్ బ్యూరో. వీటిలో డేటా సెక్యూరిటీ ఫీచర్స్ వుండే యాప్స్‌ని ఎంపిక చేసింది ఐబీ. వీటితో జాతీయ భద్రతకు భంగమే కాదు వ్యక్తిగత విషయాలకు ప్రమాదమని తేల్చింది. ప్రమాదకరమైన యాప్‌లు, ఫోన్లు వాడడం వల్ల సున్నితమైన సమాచారం సైబర్‌నేరగాళ్ల చేతిలోకి వెళ్లే అకాశముందట. పౌరులుగా మనం కూడా మన స‌మాచారాన్ని భ‌ద్రంగా ఉంచుకోవాలంటే ఈ యాప్‌ల‌కు దూరంగా ఉండాల్సిందే. ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories