Car Accident: వంతెన పై నుంచి కిందపడ్డ కారు..ముగ్గురి మృతి

Car Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. బ్రిడ్జిపై నుంచి కారు కింద పడి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.

Kranthi
Updated on: 15 May 2021 12:19 PM IST
Car Accident: Odisha Car Accident 3 Killed, 2Injured
X

ఒడిశా కార్ ఆక్సిడెంట్ (ఫైల్ ఇమేజ్)

Car Accident: ఒడిశాలో బాలాసోర్ జిల్లాలో 16వ నెంబర్ జాతీయ రహదారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే బాలాసోర్ జిల్లాలో 16వ నెంబర్ జాతీయ రహదారి వంతెనపై నుంచి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పడిపోవడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని క్షత‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం బాలసోర్ డిహెచ్‌హెచ్‌కి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.

మృతుల‌ను య‌మూర్భంజ్ జిల్లాకు చెందిన‌వారిగా గుర్తించారు. బరిపాడ నుండి భువనేశ్వర్‌కు కారు వేగంగా వెళుతుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వంతెనపై నుంచి పడిపోయాడు. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలం నుంచి మృతదేహాలను స్వాధీనం దర్యాప్తు ముమ్మరం చేశారు.

Kranthi

Kranthi

Next Story