Breaking News: లాక్ డౌన్‌పై తేల్చిన ప్రధాని మోడీ..కేసులు ఎక్కువగా ఉంటే..

కేసులు ఎక్కువగా ఉంటే.. కంటైన్మెంట్‌ జోన్‌లు పెట్టాలన్న ప్రధాని

Arun Chilukuri
Updated on: 30 April 2021 5:43 PM IST
Breaking News: లాక్ డౌన్‌పై తేల్చిన ప్రధాని మోడీ..కేసులు ఎక్కువగా ఉంటే..
X

Breaking News: దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులపై కేంద్రమంత్రులతో ప్రధాని మోడీ సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పెట్టే ఆలోచనలో కేంద్రం లేదని ప్రధాని స్పష్టం చేశారు. ఏ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా ఉంటే కంటైన్మెంట్‌ జోన్‌లు ఏర్పాటు చేసి కట్టడి చేయాలని మోడీ సూచించారు. కేంద్ర మంత్రులు సొంత ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

సెకండ్ వేవ్ పరిస్థితిని ఎదుర్కొవటానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విభాగాలు ఐక్యంగా, వేగంగా పనిచేస్తున్నాయని సమావేశంలో ప్రధాని మోడీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు వారి సొంత ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ఆయా ప్రాంతాల ప్రజలతో సన్నిహితంగా ఉండాలని, వారికి సహాయం చేయాలని, వారి అభిప్రాయం తెలుసుకోవాలని కోరారు. స్థానిక స్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించేలా చూడవలసిన అవసరాన్ని కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story