అంతా వ‌ట్టిదే... ఆమ్నెస్టీ స్కీమ్‌పై కేంద్రం వివరణ

-బంగారం నియంత్రణపై జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం వివరణ -ఆమ్నెస్టీ స్కీమ్‌ లాంటి ప్రతిపాదనలు.. -ఏమి లేవని స్పష్టం చేసిన ప్రభుత్వ వర్గాలు

admin1
Published on: 31 Oct 2019 8:03 PM IST
అంతా వ‌ట్టిదే... ఆమ్నెస్టీ స్కీమ్‌పై కేంద్రం వివరణ
X

నల్లధనం వెలికితీసేందుకు గతంలో ప్రవేశపెట్టిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం తరహాలోనే పరిమితికి మించి ఉన్న బంగారాన్ని కూడా స్వచ్ఛందంగా వెల్లడించే పథకాన్ని మోదీ సర్కార్‌ ప్రవేశపెడుతుందని వచ్చిన వార్తలపై కేంద్రం వివరణ ఇచ్చింది. ప్రజలు తమ వద్ద ఉన్న బంగారం వివరాలను స్వచ్ఛందంగా ప్రకటించే ఆమ్నెస్టీ స్కీమ్‌ వంటిదేమీ తమ ప్రతిపాదనలో లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. బడ్జెట్‌ సన్నాహక ప్రక్రియ ప్రారంభమైన క్రమంలో.. ఇలాంటి వార్తలు రావడం సాధారణమేనని కొట్టిపారేసింది. బంగారంపై నియంత్రణలు విధిస్తూ పరిమితికి మించిన బంగారం ఉంటే.. స్వచ్ఛందంగా వెల్లడించే పథకం త్వరలో ఖరారు కానుందని, ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన కేంద్రం వివరణ ఇచ్చింది.



admin1

admin1

Next Story