Bihar: నేడు బిహార్‌ అసెంబ్లీలో నితీష్‌కుమార్‌ సర్కార్‌కు బలపరీక్ష

Bihar: ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు శ్రమిస్తున్న పార్టీలు

Jyothi
Updated on: 12 Feb 2024 8:08 AM IST
Nitish Kumar to face floor test in Bihar
X

Bihar: నేడు బిహార్‌ అసెంబ్లీలో నితీష్‌కుమార్‌ సర్కార్‌కు బలపరీక్ష

Bihar: ఎన్‌డిఎతో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిహార్ సీఎం నితీష్ కుమార్ ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్నారు. గత నెలలో, విపక్షాల ఇండియా కూటమిని వదిలిపెట్టి NDA- BJP కూటమిలో తిరిగి చేరారాయన. ఆ తర్వాత రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే తన సొంత పార్టీ జనతాదళ్-యునైటెడ్ ఎమ్మెల్యేలందరికీ ఫ్లోర్ టెస్ట్ కు హాజరు కావాలని విప్ జారీ చేశారు.

ఈ నేపథ్యంలోనే బలపరీక్షకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. బలపరీక్ష జరుగనున్న నేపథ్యంలో బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో క్యాంపు ఏర్పాటు చేశారు. దాదాపు వారం రోజులుగా బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. బలపరీక్ష నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాట్నా వెళ్లనున్నారు.

Jyothi

Jyothi

Next Story