నిర్భయ కేసులో నిందితుడికి క్షమాభిక్ష వద్దన్న ఢిల్లీ సర్కారు

నిర్భయ కేసులో క్షమాభిక్ష కోరిన నిందితుడి అభ్యర్థన తిరస్కరించాలని ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ని కోరింది.

K V D Varma
Published on: 2 Dec 2019 8:53 AM IST
నిర్భయ కేసులో నిందితుడికి క్షమాభిక్ష వద్దన్న ఢిల్లీ సర్కారు
X
Nirbhaya Case Convicts File Photo

నిర్భయ కేసులో నిందితుడు పెట్టుకున్న క్షమాభిక్ష అర్జీని ఆమోదించ వద్దని ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ కు గట్టిగా సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. జాతీయ మీడియా చెబుతున్న దాని ప్రకారం నిర్భయ సామూహిక అత్యాచార కేసు కు సంబంధించిన నిందితుల్లో వినయ్ శర్మ అనే నిందితుడు క్షమాభిక్షకు అభ్యర్థించాడు.

దీనిపై ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కు ఈ మేరకు దస్త్రాన్ని పంపించింది. ''అత్యంత అత్యంత క్రూరమైన దురాగతంలో నిందితుడు పాల్గొన్నాడు. ఇలాంటి ఘోరమైన నే రాలకు మరెవరూ పాల్పడకుండా చూడాలంటే అతనికి అసాధారణ శిక్ష విధించాల్సిందే. క్షమాభిక్ష దరఖాస్తులో ) ఏమాత్రం పస లేదు. దానిని తిరస్కరించాలని గట్టిగా సిఫార్సు చేస్తున్నాం" అని ఆ దస్త్రంలో ఢిల్లీ హోంమంత్రి సత్యేందర్‌ జైన్‌ పేర్కొన్నారని సమాచారం.

దక్షిణ ఢిల్లీలో 2012 డిసెంబరు 16వ తేదీన కదులుతున్న బస్సులో ఒక పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బస్సు నుంచి రోడ్డు పక్కన పడేశారు. తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె అదే సంవత్సరం డిసెంబర్ 20 న కన్నుమూసింది. ఈ కేసులో బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచడం కోసం ఆమె పేరును నిర్భయగా నిర్ణయించారు. అంతే కాకుండా ఆ పేరుపై మహిళల సంరక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది. నేరానికి పాల్పడ్డ వారిలో ఒకరు బాల నేరస్థుడు కావడంతో సంస్కరణ గృహానికి పంపించారు. ఒక నేరస్థుడు రాంసింగ్ తానున్న జైలు లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన నలుగురికి ఉరిశిక్ష పడింది.

K V D Varma

K V D Varma

Next Story