Nirbhaya case:నిర్భయ దోషులకు ఉరి

Nirbhaya case:నిర్భయ  దోషులకు ఉరి
x
Nirbhaya mother response after hang of four convicts
Highlights

నిర్భయ దోషులకు ఉరిశిక్ష కొద్ది సేపటి క్రితం అమలు చేశారు. ధిల్లీ లోని తీహార్ జైలు నెంబరు 3 లో నిర్భయ కేసులో దోషులు నలుగురిని ఉదయం సరిగ్గా 5 : 30 గంటలకు...

నిర్భయ దోషులకు ఉరిశిక్ష కొద్ది సేపటి క్రితం అమలు చేశారు. ధిల్లీ లోని తీహార్ జైలు నెంబరు 3 లో నిర్భయ కేసులో దోషులు నలుగురిని ఉదయం సరిగ్గా 5 : 30 గంటలకు ఉరి తీశారు. 2012 లో అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేష్ సింగ్ అనే నలుగురు వ్యక్తులు కదులుతున్న బస్సులో ఒక అమ్మాయిని దారుణంగా చేరచి అనంతరం ఆమెను హత్య చేశారు. ఈ కేసులో నిందితులు తప్పించుకోవడానికి ఎన్నో ఎత్తులు వేశారు. కానీ, చివరకు న్యాయం గెలిచింది. దోషులుగా తేలిన నిందితులకు కోర్టు విధించిన మరణ శిక్షను తీహార్ జైలు అధికారులు ఈ ఉదయం అమలు చేశారు.

ఉదయం నాలుగు గంటలకే అల్పాహారం ఇచ్చి ఆ నలుగురును ఉరి కంబం ఎక్కించడానికి సిద్ధం చేశారు. తరువాత వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నలుగురినీ ఒకేసారి ఉరితీశారు. దీంతో జైలు బయట సంబరాలు నిర్వహించారు. నిర్భయ తల్లి ఈ కిరాతకులు నలుగురినీ ఉరి తీయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories