Corona Cases in India: దేశంలో 2లక్షలలోపే కొత్త‌ కేసులు

Corona Cases in India: దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.

Samba Siva Rao
Published on: 31 May 2021 10:21 AM IST
New Corona Cases in India
X

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Corona Cases in India: దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్న 1,52,734 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,80,47,534కు చేరింది. వాటి ప్రకారం నిన్న 2,38,022 మంది కోలుకున్నారు., దేశంలో నిన్నటి వరకు మొత్తం 34,48,66,883 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 16,83,135 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్ల‌డించింది.

ఇక క్రియాశీలరేటు 7.58శాతానికి తగ్గగా.. రికవరీరేటు 91.25 శాతానికి పెరిగింది.మరో 3,128 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,29,100కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,56,92,342 మంది కోలుకున్నారు. 20,26,092 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 21,31,54,129 మందికి టీకా వేశారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story