Corona Cases in India: దేశంలో త‌గ్గుముఖం ప‌డుతున్న క‌రోనా కేసులు

Samba Siva Rao
Published on: 29 May 2021 10:48 AM IST
Today Corona Cases in India
X

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Corona Cases in India: దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,73,790 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,77,29,247కు చేరింది. మరో 3,617 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. వాటి ప్రకారం నిన్న 2,84,601 మంది కోలుకున్నారు.

దేశంలో నిన్నటి వరకు మొత్తం 34,11,19,909 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 20,80,048 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,22,512కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,51,78,011 మంది కోలుకున్నారు. 22,28,724 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 20,89,02,445 మందికి వ్యాక్సిన్లు వేశారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story