Gujarat: గుజరాత్‌లో కొలువుదీరిన కొత్త కేబినెట్

Gujarat: ప్రమాణస్వీకారం చేసిన 24 మంది మంత్రులు

Sandeep Eggoju
Published on: 16 Sept 2021 5:35 PM IST
New Cabinet Arranged and 24 Ministers Sworn in Gujarat
X

ప్రమాణస్వీకారం చేసిన కొత్త మంత్రులు (ఫైల్ ఇమేజ్)

Gujarat: గుజరాత్‌లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలో కొత్త మంత్రి వర్గం ఏర్పడింది. 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మాజీ సీఎం విజయ్ రూపానీ మంత్రివర్గంలోని మంత్రులకు కొత్త కేబినెట్‌లో చోటు దక్కలేదు. మరోవైపు.. ఈరోజు అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన రాజేంద్ర త్రివేదికి మంత్రివర్గంలో చోటు దక్కింది. ప్రమాణస్వీకారం చేసిన ఇతర నేతల్లో హృషికేశ్ పటేల్, జీతూ వఘానీ, రాఘవ్ జీ పటేల్, కానూభాయ్ దేశాయ్, కిరీట్ సింహ్ రాణా, నరేశ్ పటేల్, ప్రదీప్ పర్మార్, అర్జున్ సింహ్ చౌహాన్ ఉన్నారు. కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణస్వీకారం చేయించగా.. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా హాజరయ్యారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story