పాకిస్తాన్ లో చిక్కుకున్న 250 మంది భారతీయుల తరలింపు

పాకిస్తాన్ లో చిక్కుకున్న 250 మంది భారతీయుల తరలింపు
x
Highlights

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా పాకిస్తాన్ లో చిక్కుకున్న 250 మంది భారతీయ పౌరులు గురువారం స్వదేశానికి తిరిగి వచ్చారు. పాకిస్తాన్ నుండి అటారీ-వాగా సరిహద్దు ద్వారా వచ్చిన వీరంతా జమ్మూ కాశ్మీర్ చేరుకున్నారు.

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా పాకిస్తాన్ లో చిక్కుకున్న 250 మంది భారతీయ పౌరులు గురువారం స్వదేశానికి తిరిగి వచ్చారు. పాకిస్తాన్ నుండి అటారీ-వాగా సరిహద్దు ద్వారా వచ్చిన వీరంతా జమ్మూ కాశ్మీర్ చేరుకున్నారు. వీరందరిని వారి సొంత రాష్ట్రాలకు తీసుకెళ్లడానికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. దాంతో వారంతా తమ స్వస్థలాలకు బయలుదేరారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా సహా ఇతర రాష్ట్రాల నుండి మొత్తం 748 మంది అక్కడ చిక్కుకున్నారని భారత ప్రభుత్వానికి సమాచారం అందింది.

ఇక మిగిలిన 498 మందిని శుక్ర, శనివారాల్లో భారత్ ‌కు తీసుకురానున్నారు. పాకిస్తాన్ నుండి వస్తున్న భారతీయ పౌరులకు పరీక్షించడానికి సరిహద్దులో ఒక వైద్య బృందాన్ని కూడా నియమించారు. ప్రయాణికులందరికి ఇక్కడ కోవిడ్ పరీక్షలు చేసినట్టు తెలుస్తోంది. వారందరికీ తమ రాష్ట్రాల సరిహద్దుల వద్ద మరోసారి కోవిడ్ పరీక్షలు చేయనున్నట్టు తెలుస్తోంది. నెగెటివ్ వచ్చిన వారిని 14 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్ కు తరలించాలని అధికారులు సూచించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories