అందువల్లే పాక్ విమాన ప్రమాదం.. దర్యాప్తులో సంచలనం

అందువల్లే పాక్ విమాన ప్రమాదం.. దర్యాప్తులో సంచలనం
x
Highlights

పాకిస్తాన్‌లోని కరాచీ లో మే 22 న జరిగిన విమాన ప్రమాదంపై దర్యాప్తు నివేదికను పార్లమెంటులో బుధవారం సమర్పించారు.

పాకిస్తాన్‌లోని కరాచీ లో మే 22 న జరిగిన విమాన ప్రమాదంపై దర్యాప్తు నివేదికను పార్లమెంటులో బుధవారం సమర్పించారు. నివేదికను సమర్పించిన విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్ దీనిపై మాట్లాడుతూ.. విమానంలో ఎటువంటి సాంకేతిక లోపం లేదని.. ఈ ప్రమాదానికి పైలట్, క్యాబిన్ సిబ్బంది కారణమని అని అన్నారు.

పైలట్,ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు దర్యాప్తు బృందం ప్రాథమికంగా నిర్ధారించిందని.. పైలట్, కో-పైలట్ విమానం ల్యాండింగ్‌పై దృష్టి పెట్టలేదని తెలిపారు. దీనికి ఎటిసి బాధ్యత వహిస్తుందన్నారు. విమానం క్రాష్ సమయంలో మొదటి పైలట్ కరోనావైరస్ గురించి చర్చిస్తున్నాడని. దీని రికార్డింగ్ తమ వద్ద ఉందని అన్నారు. కాగా కరాచీ విమాన ప్రమాదంలో 8 క్యాబిన్ సిబ్బందితో సహా 97 మంది మరణించారు. 2 మంది ప్రాణాలతో బయటపడ్డారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories