కరాచీలో విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్ దొరికింది

కరాచీలో విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్ దొరికింది
x
Highlights

శుక్రవారం పాకిస్థాన్ ముఖ్య పట్టణమైన‌ కరాచీలోని ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

శుక్రవారం పాకిస్థాన్ ముఖ్య పట్టణమైన‌ కరాచీలోని ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 97 మంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.. విమాన ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. విమాన ప్రమాదంలో ఫ్లైట్ డేటా రికార్డర్ , కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రతినిధి అబ్దుల్లా ఖాన్ వెల్లడించారు.

"బ్లాక్ బాక్స్ నిన్న ఆలస్యంగా కనుగొనబడింది, మేము దానిని విచారణ బోర్డుకి అప్పగించాము" అని అబ్దుల్లా ఖాన్ శనివారం చెప్పారు, ఇందులో ఫ్లైట్ డేటా రికార్డర్ మరియు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రెండూ ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా మృతిచెందిన 97 మందిలో 66 మంది మృతదేహాలను కరాచీలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్ వద్ద ఉంచగా, 31 మృతదేహాలను కరాచీలోని సివిల్ హాస్పిటల్ వద్ద ఉంచినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి మీరన్ యూసుఫ్ వెల్లడించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories