Coronavirus: భారత ప్రభుత్వ కీలక నిర్ణయం: వీసాల రద్దు!

K V D Varma
Updated on: 12 March 2020 11:21 AM IST
Coronavirus: భారత ప్రభుత్వ కీలక నిర్ణయం: వీసాల రద్దు!
X
representational image

కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాధిగా దీనిని పరకటించింది. దీనికి తోడు భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని దేశాల నుంచి టూరిస్టు వీసాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మార్చి 11 రాత్రి విడుదల చేసిన ఈ ప్రకటనలో వీసాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. మార్చి 12 అర్థరాత్రి తరువాత నుంచి ఏప్రిల్ 15 వ తేదీ వరకూ ఇది అమల్లో ఉంటుందని భారత ప్రభుత్వం తెలిపింది.

ఓసీఐ కార్డ్ హోల్డర్లకు ఉన్న వీసా ఫ్రీ నిబంధన సహా, అధికారిక వీసాలు, డొప్లొమాటిక్ వీసాలు, ఐరాస సంస్థల ప్రతినిధులకు సంబంధించిన వీసాలు, ఉద్యోగ, ప్రాజెక్టులకు సంబంధించిన వీసాలు మినహా ఇతర వీసాలన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. విదేశాల నుంచి స్వస్థలాలకు తిరిగొస్తున్న భారతీయులందరికీ స్క్రీనింగ్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వస్తున్న వారందరూ తప్పనిసరిగా 14 రోజుల ఐసోలేషన్ ఉండాలని సూచించింది. ముఖ్యంగా చైనా, ఇటలీ, ఇరాన్, కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ తదితర దేశాల నుంచి ఫిబ్రవరి 15, ఆ తర్వాత వచ్చిన ప్రయాణికులందరిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించింది.

K V D Varma

K V D Varma

Next Story