Navjot Sidhu: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా సిద్దు ప్రమాణ స్వీకారం

Navjot Sidhu: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా సిద్దు ప్రమాణ స్వీకారం * కార్యక్రమానికి హాజరుకావాలంటూ సీఎం అమరీందర్ సింగ్ లేఖ

Sandeep Eggoju
Published on: 23 July 2021 8:16 AM IST
Navjot Sidhu is Going to Take Oath as Punjab Congress PCC Chief Today
X

నవజోత్ సిద్దు (ఫైల్ ఇమేజ్)

Navjot Sidhu: పంజాబ్‌ కాంగ్రెస్‌లో సిద్దు, సీఎం అమరీందర్ సింగ్ మధ్య విభేదాలు ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పార్టీ చీఫ్‌గా ఇవాళ నవజ్యోత్ సింగ్ సిద్దు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సీఎం అమరీందర్ సింగ్ కూడా హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. తన మద్దతుదారులతో పాటు ఆయన అటెండ్ కానున్నట్టు పార్టీ శ్రేణుల్లో చర్చనీయంశంగా మారింది.

మొదట పంజాబ్ భవన్‌లో తనతో టీ కి పార్టీ నేతలను సింగ్ ఆహ్వానించారు. తర్వాత వీరంతా కలిసి పంజాబ్ కాంగ్రెస్ భవన్‌కు వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తనకు పర్సనల్ అజెండా అంటూ ఏదీ లేదని, ప్రజా అనుకూల అజెండా మాత్రమే ఉందని.. అందువల్ల ఈ రాష్ట్ర పార్టీ కుటుంబ పెద్దగా హాజరై కొత్త పీసీసీ టీమ్‌ని ఆశీర్వదించాలని లేఖలో సిద్దు కోరారు. దీనికి సింగ్ మెత్తబడినట్టు కనిపిస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story