Mumbai: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం; ఇద్దరి మృతి

Mumbai: ముంబయిలోని ఓ కరోనా ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి ఇద్దరు మృతి చెందారు.

Kranthi
Published on: 26 March 2021 8:01 AM IST
Mumbai: 2 Dead After Fire Breaks out at COVID-19 Hospital
X

Mumbai:(ఫైల్ ఇమేజ్)

Mumbai: మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అసలే కరోనాతో అల్లకల్లోలం అవుతూ వుంటే చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులు అగ్ని ప్రమాదంలో కాలి బూడిదయ్యారు. ఈ ఘటన ముంబయిలోని ఓ కరోనా ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది. ముంబయి మహా నగరంలోని భాండప్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాతో 76 మంది చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో తేరుకున్న ఆసుపత్రి సిబ్బంది సుమారు 70 మంది కరోనా బాధితులను మరో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

మొత్తం 23 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేస్తున్నట్లు ముంబయి మేయర్ తెలిపారు. ఎంత మేరకు నష్టం జరిగిందో పూర్తి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Kranthi

Kranthi

Next Story