Delhi: ప్రాణం తీసిన మస్కిటో కాయిల్‌.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి

Delhi: ఢిల్లీ శాస్త్రీ పార్క్ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 31 March 2023 3:54 PM IST
Mosquito Coil Sets Off Fire In Delhi House, 6 Killed
X

Delhi: ప్రాణం తీసిన మస్కిటో కాయిల్‌.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి

Delhi: ఢిల్లీ శాస్త్రీ పార్క్ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు విగత జీవులుగా మారారు. మంటల్లో గాయపడ్డ మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం దోమల నివారణ కోసం వెలిగించిన మస్కిటో కాయిలే అని అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదంలో ఎగిసిపడ్డ నాలుగు అంతస్తుల భవనంలో ప్రమాద సమయంలో మొత్తం ఎనిమిది మంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి అంతస్తులోని ఓగదిలో మస్కిటో కాయిల్ వెలిగించగా దాంతో బెడ్ అంటుకుని నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. వెంటిలేషన్ సౌకర్యం సరిగా లేకపోవడంతో ఇల్లంతా పొగ వ్యాపించి ఊపిరాడక చనిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. మొదటి అంతస్తులో ముగ్గురి మృతదేహాలను గుర్తించినట్లు ఫైర్ సిబ్బంది చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story