Janata Curfew: కరోనా పై మోడీ మార్క్ యుద్ధ భేరీ.. జనతా కర్ఫ్యూ!
కనిపించని శత్రువుతో ప్రపంచ మానవాళి యుద్ధం చేస్తోంది ఇప్పుడు. ఆయుధాలు సమకూర్చుకునే సమయం లేదు.. అయినా యుద్ధం చేయక తప్పని పరిస్థితి. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా.. సంఘటితంగా పరిశుభ్రత పాటించడమే నివారనోపాయంగా జనాళి ముందుకు కదలాల్సిన పరిస్థితి. ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు భారత ప్రధాని ఈరోజు (మార్చి 19). దేశ ప్రజలకు కరోనా వైరస్ పై యుద్ధానికి సమాయత్తం కావదమేలానో తనదైన పద్ధతిలో వివరించారు ప్రధాని నరేంద్ర మోడీ.
ఆయన ప్రసంగంలో ఎక్కడా అతిశయోక్తులు లేవు. అదీ..ఇదీ అనే భారీ విశేషాల వివరణ లేదు. చాలా సింపుల్ గా ప్రస్తుత పరిస్థితిని వివరించారు. రెండో ప్రపంచ యుద్ధం కంటే భయంకరమైన యుద్ధం ఇదని చెప్పి కరోనా తీవ్రహ్తను స్పష్టంగా వివరించారు. రెండు ముక్కల్లో కరోనా గురించి చెప్పేసిన ఆయన దానిని ఎదుర్కోవడానికి ఏం చేయాలో అంతే స్పష్టంగా క్లుప్తంగా చెప్పారు. అయన చెప్పిన విషయాల్లో అతి ప్రధానమైనది జనతా కర్ఫ్యూ. మోడీ మార్క్ విన్యాసం ఇది.
కనిపించని కరోనాతో ప్రపంచం చేసే యుద్ధంలో ప్రజలు ఎవరికీ వారు స్వీయ నియంత్రణ ఉండాలనేది అతి ముఖ్యమైన అంశం. దానిని అంతర్లీనంగా చెబుతూనే అందరం సమిష్టిగా కరోనా ను ఎదిరిస్తామనే సందేశాన్ని ఇవ్వడానికి ఉద్దేశించిన కార్యక్రమం. దేశవ్యాప్తంగా అన్నీ బంద్ చేసి.. ఎవరూ బయటకు రాకుండా ఉండండి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం చాలా సులువైన పని. కానీ, ఆ నిర్బంధం ఎంతమందిలో అవగాహన తీసుకువస్తున్దనేది చెప్పలేం. తప్పని సరి పరిస్థితుల్లో ఇంట్లో కూచున్నా.. బయట తిరిగితే వచ్చే నష్టం ఏమిటీ? ప్రభుత్వం అనవసరంగా ఇబ్బంది పెడుతోంది అనే భావన కలిగించే అవకాశం మన దేశంలో చాలా ఎక్కువ. సరిగ్గా దానికి వ్యతిరేకమైన భావనతో.. ఇలా అందరిలో ఒక్కటే భావం కలిగించే ఆలోచన జనతా కర్ఫ్యూ.
జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి? మనం ఏం చేయాలి?
సింపుల్ గా చెప్పాలంటే, ప్రజలంతా స్వచ్చందంగా స్వీయ నిర్భంధం లోకి వెళ్ళడమే జనతా కర్ఫ్యూ.. ఆదివారం-మార్చి 22 తేదీన ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకూ ప్రజలంతా ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండాలనేది ఈ కార్యక్రమం. ఎత్తి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళకుండా ఇళ్లలోనే ప్రజలంతా ఉండాలనేది సంకల్పం. ఇది అంత తేలిక కాదు. కానీ కరోనా లాంటి భూతాన్ని మనం తరిమి కొత్తగలం అనే ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుంది. సంఘటితంగా అందరూ ఉండగలం.. యుద్ధానికి సమాయత్తం కాగలం అనే విషయాన్ని మనకి మనం తెలుసుకోగలిగే కార్యక్రమం ఇది. అందరూ దీనిలో పాల్గోవడం ద్వారా మనలో ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోగల ఆత్మవిశ్వాసం పెరగడమే కాదు.. మనం రాబోయే రోజుల్లో ఇటువంటి నిర్భంద కర పరిస్థితులు తలెత్తితే ధైర్యంగా ఉండగలిగే అవకాశం సులభంగా కలుగుతుంది. ఇదే ప్రధాని మోడీ ఆలోచన కూడా.
వారికి థాంక్స్ చెబుదాం ఇలా..
పాల వాళ్ళు..పేపర్ బాయ్ లు.. వైద్యులు, వైద్య సిబ్బంది, తప్పనిసరైన నిత్యావసర్ వస్తువలను మనకు అందించడం కోసం అత్యంత క్లిష్ట పరిస్థితిలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న అందరికీ ఒక్కసారి థాంక్స్ చెప్పి.. వారి పట్ల మనకున్న కృతజ్ఞతా భావాన్ని వ్యక్త పరచడానికి ఈ జనతా కర్ఫ్యూ సందర్భంగా ఓ చిన్న పని చేయాలని కూడా మోడ్ పిలుపు ఇచ్చారు. దీని ప్రకారం ఆరోజు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు ఓ ఐదు నిమిషాల పాటు అందరూ తమ తమ ఇళ్ళల్లో బాల్కానీల్లో నుంచుని చప్పట్లు కొట్టడం ద్వారా అందరికీ తమ సంఘీసంఘీభావం తెలపాలని చెప్పారు. ఇది ఒక మంచి అవకాశం. మనకోసం శ్రమించే వారు మరింతగా ఎఫర్త్స్ పెట్టె విధంగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే చర్య.
అందరూ జనతా కర్ఫ్యూ విధిగా పాటించి ప్రధాని మోడీ ప్రితిపాదించిన విధానానికి మద్దతు తెలపడమే కాదు.. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎటువంటి పనికైనా మేము సిద్ధంగా ఉన్నామనే సందేశాన్ని ఇద్దాం. మరి మీరేమంటారు?




