రజనీకాంత్‌పై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు

-రజనీకాంత్ రాజకీయ నాయకుడు కాదు - పెరియార్ లాంటి వాళ్ల గురించి మాట్లాడేటప్పుడు... ఓసారి ఆలోచించి మాట్లాడాలి :స్టాలిన్

admin1
Published on: 21 Jan 2020 9:28 PM IST
రజనీకాంత్‌పై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు
X
రజనీకాంత్‌పై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు

ద్రవిడ పితిమహుడు పెరియార్‌పై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో దుమారం రేపుతున్నాయి. ఆయన ఇంటిముందు తమిళ సంఘాలు ఆందోళనలు కూడా చేపట్టాయి. తాజాగా దీనిపై డీఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ ఘాటుగా స్పందించారు. రజనీకాంత్ అసలు రాజకీయ నాయకుడు కాదని స్టాలిన్ అన్నారు. రజనీ ఓ నటుడు మాత్రమేనని... పెరియార్ లాంటి వాళ్ల గురించి మాట్లాడేటప్పుడు ఓసారి ఆలోచించి మాట్లాడాలని కోరుతున్నానని స్టాలిన్ అన్నారు.

admin1

admin1

Next Story