Delhi: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. మంటలకు 11 మంది సజీవ దహనం

Delhi: అలీపూర్‌లో పెయింట్స్ తయారీ పరిశ్రమలో పేలుడు

Jyothi
Updated on: 16 Feb 2024 9:16 AM IST
Massive Fire in Delhi Alipur
X

Delhi: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. మంటలకు 11 మంది సజీవ దహనం 

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అలీపుర్‌లోని ఓ పెయింట్స్ తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగి.. 11 మంది సజీవదహనమయ్యారు. భారీగా ఎగిసిపడిన మంటలను అదుపు చేసేందుకు 22 అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించింది. దాదాపు నాలుగు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం కూలింగ్ ప్రక్రియ సాగుతోందని ఫైర్ సిబ్బంది వివరించారు.

ఈ ఘోర ప్రమాదంలో పెయింట్‌ పరిశ్రమలో పనిచేసే కార్మికులు పలువురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతవ్వడంతో వారి కోసం పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరిశ్రమలోని కెమికల్సే పేలుడుకు కారణమని అనుమానిస్తున్నారు. కాగా దేశ రాజధాని ఢిల్లీలో తరచూ జరుగుతోన్న ఫైర్ యాక్సిడెంట్లు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.

Jyothi

Jyothi

Next Story