Mumbai: ముంబైలో భారీ అగ్నిప్రమాదం

Massive Fire Breaks Out At 60 Storey Building in Mumbai
x

Mumbai: ముంబైలో భారీ అగ్నిప్రమాదం

Highlights

Mumbai: వరుస అగ్నిప్రమాదాలు ముంబై ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.

Mumbai: వరుస అగ్నిప్రమాదాలు ముంబై ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. లాల్‌బాగ్‌లోని 60 అంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానిక పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో 19వ అంతస్తులో ఉండే ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడుకునేందుకు బాల్కనీలోకి పరిగెత్తాడు.

అక్కడి గ్రిల్స్‌ పట్టుకుని కిందకు దిగాలని ప్రయత్నించాడు. అయితే బ్యాలెన్స్‌ కోల్పోవడంతో క్షణాల్లోనే ఆ వ్యక్తి అక్కడి నుంచి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ భవనంలోని ప్రజలను కాపాడేందుకు, మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు శ్రమిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories