గౌహతిలో భారీ అగ్నిప్రమాదం

* అగ్నిప్రమాదంలో వరుసగా పేలిన 15 సిలెండర్లు... ప్రమాదంలో సర్వంకోల్పోయిన బాధితులు

R Tripura Malini
Published on: 10 Dec 2022 6:15 AM IST
Massive Fire Accident In Guwahati
X

గౌహతిలో భారీ అగ్నిప్రమాదం

Guwahati: గౌహతిలోని అంబారీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫటాసిల్‌లోని కామాఖ్య రామ్ బోరూహ్ కళాశాల వెనుక ఉన్న మురికివాడలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో వరుసగా సిలెండర్లు పేలాయి. దాదాపు 15 సిలిండర్లు పేలినట్లు అధికారులు తెలిపారు. చెలరేగిన మంటలకుతోడుగా గాలులు వీయడంతో అగ్నిప్రమాద తీవ్రతకు దోహదమైంది. ఈ ప్రమాదంలో 150 కుటుంబాలకు చెందిన పూరిగుడిసెలు, డేరాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద తీవ్రతను నియంత్రించేందుకు అగ్నిమాపకదళం రంగంలోకి దిగింది. 20 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అగ్నిప్రమాదంతో సర్వం కోల్పోయిన బాధితులు కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story