Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు

Chhattisgarh: ఎన్‌కౌంటర్‌‌లో ఇంద్రావతి కమిటీ కమాండ్ మల్లేష్.. మాద్ డివిజన్ కమిటీ కమాండర్ అరుణ్ అలియాస్ రూపేష్ మృతి

Jyothi
Published on: 17 March 2024 2:32 PM IST
Massive Encounter in Chhattisgarh Bijapur
X

Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు 

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇంద్రావతి ఏరియా కమిటీ కమాండర్ మల్లేష్, మాద్ డివిజన్ కమిటీ కంపెనీ కమాండర్ అరుణ్ అలియాస్ రూపేష్ మృతి చెందారు. హెగ్మటా అటవీ ప్రాంతంలో 20 నుంచి 25 మంది మావోయిస్టులు సమావేశం అయినట్టు భద్రతాబలగాలకు సమాచారం అందింది.

దీంతో సర్చ్ ఆపరేషన్ చేపట్టిన భద్రతాబలగాలు డీఆర్‌జీ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్‌లో మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్‌కౌంటర్ జరిగింది. కాగా.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆఫీసర్లు చనిపోగా.. మరికొందరు గాయపడ్డట్టు పోలీసులు ప్రకటనలో తెలిపారు.

Jyothi

Jyothi

Next Story