Breaking News: మావోయిస్టు అగ్రనాయకుడు ప్రశాంత్ బోస్ అరెస్ట్

Breaking News: మావోయిస్టు అగ్రనాయకుడు ప్రశాంత్‌బోస్‌ అరెస్ట్ అయ్యారు.

Arun Chilukuri
Updated on: 12 Nov 2021 5:18 PM IST
Maoists Leaders Prashanth Bose and his Wife Sheela Marandi Arrested
X

Breaking News: మావోయిస్టు అగ్రనాయకుడు ప్రశాంత్ బోస్ అరెస్ట్

Breaking News: మావోయిస్టు అగ్రనాయకుడు ప్రశాంత్‌బోస్‌ అరెస్ట్ అయ్యారు. పక్కా సమాచారంతో ప్రశాంత్‌ను జార్ఖండ్‌లో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రశాంత్‌ బోస్‌తో పాటు భార్య షీలా మరాండిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మవోయిస్టు అగ్రనేత అయిన ప్రశాంత్ బోస్‌పై గతంలో కోటి రూపాయల రివార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్ర‌శాంత్ బోస్ ప్ర‌స్తుతం సీపీఐ మావోయిస్టు సెంట్ర‌ల్ క‌మిటీ మెంబ‌ర్‌, పొలిట్‌బ్యూరో, సెంట్ర‌ల్ మిల‌ట‌రీ క‌మిష‌న్, ఈస్ట్ర‌న్ రీజిన‌ల్ బ్యూరో సెక్ర‌ట‌రీగా కొన‌సాగుతున్నారు. నార్త్ ఈస్ట్ స్టేట్స్‌తో పాటు బీహార్, జార్ఖండ్‌, బెంగాల్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో విప్ల‌వోద్య‌మాన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ బోస్ జార్ఖండ్‌లోని స‌రందా అడ‌వుల నుంచి పార్టీ కార్య‌క‌లాపాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story