BRS Bahiranga Sabha: కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన పలువురు ప్రజాప్రతినిధులు

BRS Bahiranga Sabha: నాందేడ్‌లో బీఆర్ఎస్‌ బహిరంగ సభ

Dhatripriya
Published on: 5 Feb 2023 3:28 PM IST
Many Public Representatives Joined BRS In The Presence Of KCR
X

BRS Bahiranga Sabha: కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన పలువురు ప్రజాప్రతినిధులు

BRS Bahiranga Sabha: నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. శివాజీ, బసవేశ్వర్, పూలే, అంబేద్కర్, అన్నబావు సాటే, ఐలదేవి హోల్కర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేశారు. అనంతరం బీఆర్ ఎస్ లోకి పలువురు ప్రజాప్రతినిధులను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. మరోవైపు తెలంగాణ బయట జరుగుతున్న మొదటి బీఆర్ఎస్ సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు.

అంతకు ముందు నాందేడ్‌లోని గురుద్వారాను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో కాకుండా తొలిసారిగా మహారాష్ట్రలోని నాందేడ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు జాతీయ, మహారాష్ట్ర మీడియా ప్రతినిధులతో భేటీ అవుతారు. 5 గంటలకు నాందేడ్ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతారు.

Dhatripriya

Dhatripriya

Next Story