Wedding Gift: హోం థియేటర్ పేలుడులో ట్విస్ట్.. బాంబు అమర్చి గిఫ్ట్‌గా ఇచ్చిన వధువు మాజీ ప్రియుడు..!

Wedding Gift: హోం థియేటర్ పేలుడులో ట్విస్ట్.. బాంబు అమర్చి గిఫ్ట్‌గా ఇచ్చిన వధువు మాజీ ప్రియుడు..!

Arun Chilukuri
Published on: 5 April 2023 12:05 PM IST
Man Gifts His Ex Girlfriend Home Theatre With Bomb As Wedding Gift
X

Wedding Gift: హోం థియేటర్ పేలుడులో ట్విస్ట్.. బాంబు అమర్చి గిఫ్ట్‌గా ఇచ్చిన వధువు మాజీ ప్రియుడు..!

Home Theatre Blast: ఛత్తీస్‌గఢ్‌లో పెళ్లికానుకగా వచ్చిన హోం థియేటర్ పేలిపోయి వరుడు, అతడి సోదరుడు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విస్తుగొలిపే వాస్తవం వెలుగులోకి వచ్చింది. హోం థియేటర్ లో బాంబును అమర్చడం వల్లే పేలుడు సంభవించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ గిఫ్టు ఎవరిచ్చారనే విషయంపై విచారణ జరగగా అసులు విషయం వెలుగులోకి వచ్చింది. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో వధువు మాజీ ప్రియుడే హోం థియేటర్‌లో బాంబు పెట్టి గిఫ్ట్‌గా ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

కబీర్‌ధామ్ అడిషనల్ ఎస్పీ మనీషా ఠాకూర్ మాట్లాడుతూ.. తనను కాదని మరొకర్ని ప్రియురాలు మరొకర్ని పెళ్లి చేసుకుంటోందని నిందితుడు కోపం పెంచుకున్నాడు. దీంతో తన వద్ద ఉన్న పాత హోం థియేటర్‌లో పేలుడు పదార్థాలు ఉంచి గిఫ్టుగా ఇచ్చినట్లు నేరాన్ని అంగీకరించాడు. హతుడు హేమేంద్ర మెరావికి ఏప్రిల్ 1న వివాహం జరిగింది. వరుడు, ఇతర కుటుంబ సభ్యులు ఓ గదిలో దాచిపెట్టిన పెళ్లి కానుకలను ఒక్కొక్కటీ తెరుస్తున్నారు. ఈ క్రమంలో గిఫ్టు బాక్సులో ఉన్న హోమ్ థియేటర్‌‌ను హేమేంద్ర బయటకు తీసి.. గదిలో ఉన్న కరెంట్ బోర్డుకు కనెక్ట్ చేసి స్విచ్ఛాన్ చేశాడు. ఇంతలోనే భారీ శబ్దంతో అది పేలిపోయింది. ఈ ఘటనలో హేమేంద్ర తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందగా.. సోదరుడు రాజ్‌కుమార్ (30) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనలో ఏడాదిన్నర చిన్నారి సహా నలుగురు గాయపడ్డారు అని అడిషనల్ ఎస్పీ మనీషా ఠాకూర్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story