Mamata Banerjee: బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం

Mamata Banerjee: నుదిటిపై గాయంతో ఆస్పత్రిలో చేరిన మమత

Jyothi
Published on: 15 March 2024 8:36 AM IST
Mamata Banerjee Suffered major injury says TMC
X

Mamata Banerjee: బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం

Mamata Banerjee: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం అయింది. నుదిటిపై గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం కాగా... హుటాహుటిన దీదీని ఎస్ కేయం ఆస్పత్రిలో చేర్చారు. తలకు గాయం అయిన ఫొటోను సోషల్ మీడియాలో టీఎంసీ పోస్ట్ చేసింది. అయితే మమతకు గాయం ఎలా అయింది అనే విషయాన్ని మాత్రం టీఎంసీ వెల్లడించలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మమత కాలికి గాయం కావడంతో స్ట్రెచర్ లోనే ప్రచారం నిర్వహించారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముంగిట ఆమె నుదిటికి గాయం అయింది.

Jyothi

Jyothi

Next Story