Mamata Banerjee: మరికాసేపట్లో ప్రధానితో మమత భేటీ

Mamata Banerjee: కాంగ్రెస్ సీనియర్లతో మమత వరుస భేటీలు * ఇప్పటికే కమల్ నాథ్ ను కలసిన మమత

Sandeep Eggoju
Updated on: 27 July 2021 4:43 PM IST
Mamata Banerjee Going to be Meet PM Modi Soon
X
ప్రధాని మోడీని కలువనున్న మమతా బెనర్జీ (ఫైల్ ఇమేజ్)

Mamata Banerjee: అయిదు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన మమతా బెనర్జీ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఈ సాయంత్రం ప్రధాని మోడీని కలవనున్న దీదీ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర సమస్యలపై చర్చించే ఆస్కారం కనిపిస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ నేతలతో ఆమె వరుస భేటీలు కొనసాగిస్తున్నారు.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమల్ నాథ్ స్వయంగా ఢిల్లీలోని టీఎంసీ కార్యాలయానికి వెళ్లి మమతతో చర్చలు జరిపారు. మరో సీనియర్ నేత ఆనంద్ శర్మతో కూడా మమత భేటీ అయ్యారు. రేపు శరద్ పవార్ ఇతర మిత్ర పక్షాలను కలవనున్నారు.. దీదీతో భేటీ సంతృప్తి నిచ్చిందని, దేశాన్ని పట్టిపీడిస్తు్న్న అనేక అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని కమల్ నాథ్ అన్నారు.. తమ టార్గెట్ 2024 కాదని, టీఎంసీ తమకు పాత స్నేహితుడేనని అన్నారు. మరోవైపు రేపు మమత మరికొన్ని మిత్ర పక్షాలను కలిసే ఆస్కారం కనిపిస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story