అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వంకు వరుస ఎదురుదెబ్బలు

AIADMK: ఒకవైపు చేజారిన నాయకత్వం.. మరోవైపు అనుచరుల్లో అసంతృప్తితో అన్నాడీఎంకే నేత పన్నీర్‌ సెల్వంకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు.

Arun Chilukuri
Updated on: 23 Feb 2023 7:30 PM IST
Major set Back to AIDMK Leader Panneerselvam
X

అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వంకు వరుస ఎదురుదెబ్బలు

AIADMK: ఒకవైపు చేజారిన నాయకత్వం.. మరోవైపు అనుచరుల్లో అసంతృప్తితో అన్నాడీఎంకే నేత పన్నీర్‌ సెల్వంకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. పార్టీ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నికపై అటు మద్రాస్ హైకోర్టులోనూ, ఇటు సుప్రీంకోర్టులోనూ రెండు చోట్లా పన్నీర్ సెల్వంకు నిరాశే ఎదురైంది.

ద్వంద్వ నాయకత్వం రద్దు చేసినప్పటి నుంచి అన్నాడీఎంకేలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు చీలిపోయాయి. ఈ క్రమంలో ఈరోడు తూర్పు నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలోనూ ఈ రెండు వర్గాల నుంచి నేతలు పోటీకి దిగారు. అయితే అన్నాడీఎంకే సెక్రటరీగా ఈపీఎస్ ఎన్నికను సుప్రీంకోర్టు సమర్థించడంతో పన్నీర్ సెల్వం వర్గం నుంచి పోటీ చేసిన అభ‌్యర్థి పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరోవైపు పార్టీకి సంబంధం లేని వ్యక్తి్ని అభ్యర్థిగా ప్రకటించారనే అసంతృప్తితో ఓపీఎస్ వర్గం నేత మురుగానందంతో పాటు మరో 106 మంది పన్నీర్ వర్గాన్ని వీడారు. ఇలా వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న పన్నీర్ సెల్వం భవిష్యత్‌ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story