Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్..8మంది మావోయిస్టులు హతం

Dhivi
Published on: 2 Feb 2025 5:59 AM IST
Major encounter in Chhattisgarh 8 Maoists killed
X

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్..8మంది మావోయిస్టులు హతం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగులూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇప్పటి వరకు 8 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. మరణించినవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మావోయిస్టుల గురించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గంగులూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు.

ఉదయం 8.30గంటల ప్రాంతంలో పోలీసులు నక్సల్స్ మధ్య ఎన్ కౌంటర్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఇంకా మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగులుతోంది. పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చలపతితోపాటు 16మంది వరకు మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో మరో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

Dhivi

Dhivi

Next Story