Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం

Dhivi
Published on: 17 Feb 2025 6:58 AM IST
Major earthquake hits national capital Delhi
X

Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం

Earthquake: సోమవారం తెల్లవారుజామున ఢిల్లలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పరుగులు పెట్టారు. ఇళ్లలో నుంచి రోడ్లమీదకు వచ్చారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం, న్యూఢిల్లీలో ఉదయం 5:36 గంటలకు భూకంప ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. భూకంప కేంద్రం ఢిల్లీ. ఢిల్లీ ఎన్‌సిఆర్‌తో పాటు, హర్యానా, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. చండీగఢ్‌లో కూడా భూకంపం సంభవించింది. భూకంపం తర్వాత ఢిల్లీ పోలీసులు హెల్ప్‌లైన్ నంబర్‌ను జారీ చేశారు. 112 కు కాల్ చేయడం ద్వారా సహాయం పొందవచ్చని పేర్కొన్నారు.


Dhivi

Dhivi

Next Story