Corona Updates: మహారాష్ట్రను వణికిస్తోన్న కరోనా

కరోనా ( ఫోటో: ఫైల్ ఇమేజ్)
Corona Updates: రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 24 లక్షలకు చేరగా.. 53 వేల మందికిపైగా కరోనాతో మరణించారు.
Corona Updates: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ప్రధానంగా మహారాష్ట్రను కరోనా వణుకు పుట్టిస్తోంది. రోజురోజుకు అక్కడ ఆందోళనకర స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో భారత్‌లో కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏకంగా 25,833 కేసులు బయటపడ్డాయి. కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా ఈ రాష్ట్రంలో 58 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. ఇక ఆర్థిక రాజధాని ముంబయిలో నిన్న ఒక్క రోజే మూడు వేలకు చేరువగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 24 లక్షలకు చేరింది. 53 వేల మందికిపైగా కరోనాతో మరణించారు.
ముంబయిలో లాక్‌డౌన్ అవసరం లేదు...
కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి ముంబయిలో లాక్‌డౌన్ విధిస్తారన్న వార్తలను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే కొట్టిపారేశారు. కరోనా పరిస్థితిని కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధమై ఉందని.. ముంబయిలో లాక్‌డౌన్ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, దేశంలోని కొవిడ్ క్రియాశీల కేసుల్లో 60 శాతానికి పైగా కేసులు కేవలం మహారాష్ట్రలోనే ఉన్నాయి. అంతేకాకుండా కరోనా మరణాలు కూడా ఇక్కడే అధికంగా నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతోన్న కొత్త కేసుల్లో సుమారు 85 శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడులోనే వచ్చాయని ఆరోగ్య శాఖ తెలిపింది.
జనసేన కోసం రంగంలోకి 'మెగా ఫ్యాన్స్'
22 May 2022 9:45 AM GMTఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన పార్టీ టీఆర్ఎస్ - ఓదేలు
22 May 2022 8:15 AM GMTప్రధాని సంచలన నిర్ణయం.. అదృష్టం కోసం తన పుట్టిన రోజు మార్పు..
21 May 2022 1:30 PM GMTయమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMT
Chandigarh: ఉత్తరాదిన మీటర్ల ఇష్యూ లేవనెత్తిన కేసీఆర్..
22 May 2022 2:30 PM GMTచెత్తకుప్పలను తలపిస్తున్న చార్ధామ్ రోడ్లు.. పెను ప్రమాదం పొంచి ఉందని...
22 May 2022 2:00 PM GMTJogi Ramesh: సీఎం జగన్ దావోస్ వెళ్తే టీడీపీ నాయకులకు కడుపు మంట ఎందుకు?
22 May 2022 1:30 PM GMTభారత్‌పై మళ్లీ ఇమ్రాన్‌ఖాన్ ప్రశంసల జల్లు
22 May 2022 1:00 PM GMTబారానా పెంచి చారానా తగ్గించారు.. కేంద్రంపై మంత్రి హరీష్ రావు ఫైర్..
22 May 2022 12:30 PM GMT