Ajit Pawar: అజిత్ పవార్‌కు ఆదాయపు పన్ను శాఖ షాక్

Ajit Pawar: వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అటాచ్

Sandeep Eggoju
Published on: 2 Nov 2021 7:48 PM IST
Maharashtra Deputy CM Ajit Pawar’s Property Worth ₹1000 Crore Seized
X

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ (ఫైల్ ఇమేజ్)

Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ సీనియర్ అజిత్ పవార్‌కు ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ముంబైలోని నారిమన్ పాయింట్‌లో గల నిర్మల్ టవర్‌తో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాల్లో ఆయనకు సంబంధించిన పలు ఆస్తులను ఐటీ శాఖ అధికారులు అటాచ్ చేశారు. ఇందులో అజిత్ పవార్ కుటుంబానికి చెందిన కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. గత నెల అజిత్ పవార్ సోదరీమణుల నివాసాలు, కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 184 కోట్ల మేర లెక్కకు రాని ఆదాయాన్ని గుర్తించారు. అయితే ఈ సోదాలపై అప్పట్లో అజిత్ స్పందిస్తూ తమ ఆదాయానికి సంబంధించి రెగ్యులర్‌గా పన్నులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే తమపై ఈ దాడులు చేయిస్తోందని దుయ్యబట్టారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story