Madhya Pradesh Police: ఖాండ్వా జిల్లాలో పోలీసుల దాష్టీకం

Madhya Pradesh Police: కోవిడ్ పేషంట్‌పై లాఠీలు ఝుళిపించిన పోలీసులు * సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Sandeep Eggoju
Updated on: 12 April 2021 11:32 AM IST
Madhya Pradesh Police Beaten a 20 Years Covid Patient
X

కోవిడ్ పేషెంట్ పై పోలీసుల దాడి 

Madhya Pradesh Police: మధ్యప్రదేశ్‌ లోని ఖాండ్వా జిల్లాలో పోలీసుల తీరు విమర్శలకు దారి తీస్తోంది. 20 ఏళ్ల కొవిడ్ పేషంట్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. బంజారీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ 20 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవగా..క్వారంటైన్‌లో ఉంచాలని సూచించారు ఆరోగ్య కార్యకర్తలు. దీంతో పేషంట్‌ కుటుంబం వారిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆరోగ్య కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు.. ఆ పేషంట్‌ను ఇంటికి వెళ్లి మరీ చితకబాదారు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై కూడా లాఠీ ఝుళిపించారు.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై విమర‌్శలు వెల్లువెత్తాయి. అయితే పోలీసు అధికారులు మాత్రం పేషంట్ కుటుంబం దాడి చేసే ప్రయత్నం చేయడం వల్లే పోలీసులు వెంటనే లాఠీఛార్జ్ చేశామని పోలీసులు చెప్పారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story