ఆసుపత్రిలో చేరిన మధ్యప్రదేశ్ గవర్నర్..

Madhya Pradesh Governor Lalji Tandon has hospitalised

Raj
By Raj
Published on: 13 Jun 2020 10:15 PM IST
ఆసుపత్రిలో చేరిన మధ్యప్రదేశ్ గవర్నర్..
X

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం మెదంత ఆసుపత్రిలో చేరారు. లాల్జీ టాండన్ కు జ్వరం తోపాటు యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, దాంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది.

గవర్నర్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని.. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని చెప్పారు వైద్యులు తెలిపారు. కాగా ఆదివారం గవర్నర్‌ను డిశ్చార్జ్ చేయవచ్చని గవర్నర్ కు చికిత్స అందిస్తున్న డాక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు. మరోవైపు గవర్నర్ ఆసుపత్రిలో చేరారని తెలుసుకున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.

Raj

Raj

Next Story