Madhya Pradesh Governor Lal Ji Tandon : మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ లాల్‌జీ టండ‌న్ క‌న్నుమూత‌

Arun Chilukuri
Published on: 21 July 2020 9:45 AM IST
Madhya Pradesh Governor Lal Ji Tandon : మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ లాల్‌జీ టండ‌న్ క‌న్నుమూత‌
X

Madhya Pradesh Governor Lal Ji Tandon : మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్ (85) ఈరోజు ఉదయం కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లక్నోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు. లాల్‌జీ టండన్ మరణాన్ని ఆయన కుమారుడు, యూపీ ప్రభుత్వ మంత్రి అశుతోష్ టండ‌న్ తెలిపారు బాబూజీ ఇక లేరని ఆయన ట్వీట్ చేశారు.

గవర్నర్‌ టాండన్‌ మృతిపట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గవర్నర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. లఖ్‌నవూ సమీపంలో చౌక్‌నవూ గ్రామంలో జన్మించిన టాండన్‌ 20 జులై 2019న మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. బీజేపీలో సీనియర్‌ నేతగా గుర్తింపు పొందిన లాల్జీ టాండన్ పలు ఉన్నత పదవులను చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story