Elections Schedule 2024: ఎల్లుండి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్!

Elections Schedule 2024: ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చివరిదశకు ఈసీ కసరత్తు

Jyothi
Published on: 14 March 2024 11:18 AM IST
Lok Sabha Elections 2024 Schedule Likely To Be Announced This Week
X

Elections Schedule 2024: ఎల్లుండి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్!

Elections Schedule 2024: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. 48 గంటల్లో ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. శనివారం లోపు నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసేందుకు ఎన్నికల కమిషన్‌ సిద్ధమవుతోంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలను సేకరించింది.

మొత్తం ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఇక లోక్‌సభ ఎన్నికలతో పాటు.,.. ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అటు జమ్ముకశ్మీర్‌లోనూ ఎన్నికల నిర్వహణపై నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ పర్యటించి వివరాలు తీసుకున్నారు. అక్కడ కూడా లోక్‌సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story